తెలంగాణ
వైభవ్ వరల్డ్ రికార్డు
16 బంతుల్లో ఫిఫ్టీ..! 28 బంతుల్లో సెంచరీ..!! 52 బంతుల్లో డబుల్ సెంచరీ..!!!
భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరోసారి ప్రపంచ క్రికెట్ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 52 బంతుల్లోనే డబుల్ సెంచరీ బాదాడు. దీంతో లిస్ట్-ఏ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతకుముందు 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన వైభవ్.. 28 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా అదే దూకుడు కొనసాగించాడు. అతడి మెరుపు ఇన్నింగ్స్‌తో యూఏఈ బౌలర్లు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
Vaibhav's world record
Indian young sensation Vaibhav Suryavanshi has once again captured the attention of world cricket. He scored a double century in just 52 balls against UAE in the Asia Cup Rising Stars tournament. With this, he created a record as the fastest player to score a double century in the history of List-A cricket. Vaibhav, who had previously completed his half-century in just 16 balls, completed his century in 28 balls. He continued the same aggressiveness after that. His lightning innings left the UAE bowlers in a state of disarray.