తెలంగాణ

పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి వరంగల్ ఎంపీ కావ్య

ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి

పోలియో రహిత సమాజానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి వరంగల్ ఎంపీ కావ్య

హన్మకొండ :పోలియో మహమ్మారిని దేశం నుంచి నిర్మూలించినప్పటికీ, భవిష్యత్తులో ఆ వ్యాధి మళ్లీ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య అన్నారు. ఐదేళ్లలోపు చిన్నారులందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసా కల్పించాలని తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ప్రభుత్వ మెటర్నిటీ ఆసుపత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవీ శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అప్పయ్య, వివిధ శాఖల అధికారులు, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Warangal MP Kavya says everyone should take responsibility for a polio-free society

Hanumakonda: Although the polio epidemic has been eradicated from the country, Warangal Member of Parliament Dr. Kadiyam Kavya said that the disease should be kept alert in the future so that it does not spread again. She called on parents to ensure a healthy future by giving polio drops to all children under the age of five. Pulse Polio was organized at the Government Maternity Hospital on Sunday under the auspices of the Hanumakonda District Medical and Health Department. Warangal West MLA Nayini Rajender, Hanumakonda District Collector Chahat Bajpai, Red Cross Society State Executive Committee Member EV Srinivasa Rao, District Medical and Health Department Officer Appaiah, officers of various departments, doctors, medical staff and others participated in the program.

More తెలంగాణ news

All news · About J Voice