తెలంగాణ

ప్రీ..బస్ తీసేయండి..బస్సు ఎక్కి నా..భార్య ఎటో పోయింది...

తన భార్య ఫ్రీబస్ ఎక్కి వెళ్లిపోయింది అంటూ ఓ వ్యక్తి ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశాడు..

ఈ..ఘటన కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలంలోని రేగులపల్లిలో చోటు చేసుకుంది. గ్రామంలో జరిగిన ఓ సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి కనకయ్య అనే వ్యక్తి తన భార్యతో గొడవ జరిగిందని, దాంతో ఆమెను మందలించడం వల్ల ఫ్రీబస్ ఎక్కి వెళ్లిపోయింది అని అన్నాడు. రెండు మూడు రోజుల నుండి వెతికినా ఆమె ఆచూకీ తెలియడంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికే ఆమెను వెతకడానికి రెండు మూడు వేలు ఖర్చు చేయాల్సి వచ్చిందని అన్నాడు. దయచేసి ఫ్రీబస్ పథకాన్ని రద్దు చేయాలని, ఆ పథకం వల్ల తన భార్య కనిపించకుండా పోయిందని.. చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే మహిళ ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. ఫ్రీబస్ వల్ల చాలా మంది మహిళలు లాభం పొందుతున్నారని అన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

More తెలంగాణ news

All news · About J Voice