విద్య
ఇంటర్ లోను ఒక్కో పరీక్ష మధ్య 2 రోజుల వ్యవధి??
విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే.
హైదరాబాద్ ఇంటర్మీడియట్ విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించే దిశగా.. వార్షిక పరీక్షల మధ్య వ్యవధి పెంచాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఒక రోజు ప్రథమ, మరోరోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తుండడంతో ప్రతి పరీక్షకు కనీసం ఒకరోజు వ్యవధి లభిస్తోంది. దీన్ని రెండు రోజులకు పెంచాలన్నది యోచన. ఈ మేరకు సాధారణ పద్ధతిలో ఒక టైమ్ టేబుల్, ఒక్కో పరీక్షకు రెండు రోజుల వ్యవధితో మరో షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు ప్రతిపాదించింది. దీనివల్ల పాఠ్యాంశాల పునశ్చరణకు సమయం లభిస్తుందని, విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాస్తారని విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా భావిస్తున్నారు. ఫలితంగా వ్యవధిఉండే టైమ్ టేబుల్ కు ఆమోదం లభించవచ్చని సమాచారం. వచ్చే ఫిబ్రవరి 24న పరీక్షలు ప్రారంభమవుతాయని తెలుస్తోంది. గత ఏడాది 'పది'లో ప్రయోగం మంచి ఫలితాలు వచ్చాయని సూచన