టెక్నాలజీ

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్‌.. 22 గంటల్లో భూమి చుట్టూ 14 సార్లు ప్రయాణం, తిరిగి భూమిపైకి వచ్చిన స్టార్‌షిప్‌

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ స్టార్‌షిప్‌ ఫ్లైట్‌-15 ప్రయోగంలో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది. టెక్సాస్‌ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన స్టార్‌షిప్‌-42.. 22 గంటలకు పైగా అంతరిక్షంలో ప్రయాణించి భూమికి తిరిగి వచ్చింది. భూమి చుట్టూ సుమారు 14 సార్లు తిరిగి, 26 స్టార్‌లింక్‌ వీ3 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. స్టార్‌బేస్‌ లాంచ్‌ టవర్‌పై ఉన్న రెండు భారీ యాంత్రిక చేతులు ‘చాప్‌స్టిక్స్‌’ దాన్ని విజయవంతంగా పట్టుకున్నాయి. కక్ష్యలోకి వెళ్లి తిరిగొచ్చిన స్టార్‌షిప్‌ను ప్రయోగ కేంద్రంలోనే పట్టుకోవడం ఇదే తొలిసారి

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్‌.. 22 గంటల్లో భూమి చుట్టూ 14 సార్లు ప్రయాణం, తిరిగి భూమిపైకి వచ్చిన స్టార్‌షిప్‌

అంతరిక్ష ప్రయోగాల్లో మరో చారిత్రాత్మక ఘట్టం నమోదైంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ చేపట్టిన స్టార్‌షిప్‌ ఫ్లైట్‌-15 ప్రయోగం కీలక విజయాన్ని అందుకుంది. అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి భూమికి చేరుకున్న స్టార్‌షిప్‌ పైభాగాన్ని టెక్సాస్‌లోని స్టార్‌బేస్‌ ప్రయోగ కేంద్రంలో భారీ యాంత్రిక చేతులతో సక్సెస్‌ఫుల్‌గా పట్టుకున్నారు. లాంచ్‌ టవర్‌పై ఏర్పాటు చేసిన చాప్‌స్టిక్స్‌గా పిలిచే 2 భారీ యాంత్రిక చేతులు స్టార్‌షిప్‌ను గాల్లోనే ఒడిసిపట్టాయి. కక్ష్యలోకి వెళ్లి తిరిగి వచ్చిన స్టార్‌షిప్‌ వ్యోమనౌకను ప్రయోగ కేంద్రంలోనే ఇలా పట్టుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీంతో పూర్తిస్థాయిలో రాకెట్లను పునర్వినియోగించాలన్న స్పేస్‌ఎక్స్‌ లక్ష్యం దిశగా మరో కీలక ముందడుగు పడింది.

స్పేస్‌ఎక్స్‌ 15వ సమగ్ర స్టార్‌షిప్‌ ప్రయోగ పరీక్షను నవంబర్‌ 14వ తేదీన అమెరికాలోని టెక్సాస్‌ స్టార్‌బేస్‌ నుంచి చేపట్టింది. ఈ ప్రయోగంలో స్టార్‌షిప్‌-42 అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. సుమారు 275 కిలోమీటర్ల ఎత్తులోని లోఎర్త్‌ ఆర్బిట్‌లోకి చేరుకుంది. అక్కడ 22 గంటలకు పైగా ప్రయాణించింది. భూమి చుట్టూ సుమారు 14 సార్లు స్టార్‌షిప్ పరిభ్రమించింది. ఈ ప్రయాణంలో భాగంగా తదుపరి తరం స్టార్‌లింక్‌ వీ3 ఉపగ్రహాల్లో 26 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది

ఇందులోని 3 ఉపగ్రహాలకు ప్రత్యేక కెమెరాలను అమర్చారు. వాటి ద్వారా స్టార్‌షిప్‌ హీట్‌ షీల్డ్‌, ఇతర పరికరాల పనితీరును పరిశీలించారు. భూమికి తిరిగి వచ్చే సమయంలో వ్యోమనౌక పరిస్థితిని అంచనా వేయడానికి ఈ పరిశీలనలు ఎంతో ఉపయోగపడ్డాయి. అన్ని తనిఖీలు పూర్తయ్యాక స్టార్‌షిప్‌ డీ-ఆర్బిట్‌ బర్న్‌ నిర్వహించి భూమివైపు ప్రయాణం ప్రారంభించింది. వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత నియంత్రిత ల్యాండింగ్‌ విన్యాసాన్ని చేపట్టి స్టార్‌బేస్‌ ప్రయోగ కేంద్రం వైపు దూసుకొచ్చింది. భారత కాలమానం ప్రకారం నవంబర్‌ 15వ తేదీన తెల్లవారుజామున సుమారు 2.52 గంటలకు లాంచ్‌ టవర్‌ వద్దకు చేరుకుంది. అక్కడి 2 భారీ యాంత్రిక చేతులు స్టార్‌షిప్‌ను విజయవంతంగా పట్టుకుని గాల్లోనే నిలిపివేశాయి.

స్టార్‌షిప్‌ ప్రయోగ కేంద్రంలోని భారీ లాంచ్‌ టవర్‌కు అమర్చిన 2 యాంత్రిక చేతులను ‘చాప్‌స్టిక్స్‌’ అని పిలుస్తారు. ఇవి రాకెట్‌ భాగాలను తిరిగి భూమికి చేరుకున్నప్పుడు పట్టుకునేలా ప్రత్యేకంగా రూపొందించారు. ఈ వ్యవస్థను స్పేస్‌ఎక్స్‌ ‘మెచజిల్లా’ అని కూడా పిలుస్తుంది. సాధారణంగా రాకెట్‌ ప్రయోగం పూర్తి అయిన తర్వాత దాని భాగాలు సముద్రంలో పడిపోవడం, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ల్యాండ్‌ కావడం జరుగుతుంది. కానీ స్పేస్‌ఎక్స్‌ మాత్రం రాకెట్ భాగాలను తిరిగి భూమిపైన ల్యాండ్ చేయాలని లక్ష్యంగా పనిచేస్తోంది.

SpaceX creates history.. Starship orbits Earth 14 times in 22 hours, returns to Earth

Another historic milestone has been recorded in space experiments. The Starship Flight-15 experiment undertaken by the world's richest man Elon Musk's SpaceX company has achieved a key success. The top of the Starship, which had gone into space and returned to Earth, was successfully caught by huge mechanical arms at the Starbase launch center in Texas. Two huge mechanical arms called chopsticks installed on the launch tower caught the Starship in the air. It is noteworthy that this is the first time that a Starship spacecraft that has gone into orbit and returned to the launch center has been caught in this way. With this, another key step has been taken towards SpaceX's goal of fully reusing rockets.

SpaceX conducted the 15th comprehensive Starship launch test on November 14 from Starbase in Texas, USA. In this experiment, Starship-42 flew into space. It reached a low-Earth orbit of about 275 kilometers. It traveled there for more than 22 hours. Starship orbited the Earth about 14 times. As part of this journey, 26 satellites of the next-generation Starlink V3 satellites were launched into orbit

Special cameras were installed on 3 of these satellites. Through them, the performance of the Starship heat shield and other equipment was examined. These observations were very useful in assessing the condition of the spacecraft during its return to Earth. After completing all the checks, Starship performed a de-orbit burn and began its journey towards Earth. After entering the atmosphere, it undertook a controlled landing maneuver and headed towards the Starbase launch site. It reached the launch tower at approximately 2.52 am on November 15, according to Indian time. Two large mechanical arms successfully caught the Starship and stopped it in mid-air.

The two mechanical arms attached to the massive launch tower at the Starship launch site are called ‘chopsticks’. They are specially designed to catch the rocket parts as they return to Earth. SpaceX also calls this system ‘Mechazilla’. Usually, after a rocket launch, its parts fall into the ocean and land in specially designated areas. But SpaceX is working on the goal of landing the rocket parts back on Earth.

More టెక్నాలజీ news

All news · About J Voice