ఆంధ్రప్రదేశ్

ఫిబ్రవరి వరకు ఎల్నినో బలంగా కొనసాగే అవకాశం

*వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఎల్నినో బలంగా కొనసాగే అవకాశం ఉందని భారత జాతీయ మహాసముద్ర సమాచార సేవల కేంద్రం(ఇన్కాయిస్) శాస్త్రవేత్త డాక్టర్ ఫ్రాన్సిస్ ఎ.పవనతార వెల్లడించారు..!!* పెరుగుతున్న సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, సముద్రపు పై పొరల్లో ఉష్ణ నిల్వ పెరగడం, విస్తృతంగా సముద్ర ఉష్ణ తరంగాలు ఏర్పడటం వంటి పరిణామాల వల్ల వర్షపాతం, సముద్ర పర్యావరణ వ్యవస్థలు, మత్స్య సంపద, తీర ప్రాంతాలపై గణనీయంగా ప్రభావం చూపుతున్నాయని తెలిపారు. ఎల్నినో ప్రభావం, సముద్ర పర్యావరణంలో మార్పులపై ఇన్కాయిస్ సమగ్ర అధ్యయనం కోసం చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఎల్నినో, ఇండియన్ ఓషన్ డైపోల్(ఐఓడీ)లను మరింత కచ్చితత్వంతో అంచనా వేయగలిగితే దేశంలో రుతుపవనాల అంచనాలో గణనీయమైన పురోగతి సాధించవచ్చని వెల్లడించారు.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice