క్రైమ్

కీసర పోలీస్ స్టేషన్‌లో రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్‌ఐ శ్రీనివాస్

హైదరాబాద్: మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లా కీసర పోలీస్‌ స్టేషన్‌లో మరో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రూ.2 లక్షల లంచం తీసుకుంటున్న ఆరోపణలపై ఎస్‌ఐ శ్రీనివాస్‌ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడినట్లు సమాచారం. ఒక కేసులో చార్జిషీట్‌ దాఖలు చేసేందుకు రూ.2 లక్షలు డిమాండ్‌ చేసినట్లు ఎస్‌ఐపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మొత్తాన్ని లంచంగా స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే పోలీస్‌ స్టేషన్‌లో ఇటీవల సీఐ లంచం తీసుకుంటూ పట్టుబడిన ఘటన మరువకముందే మరో పోలీసు అధికారి ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశంగా మారింది. ఒకే పోలీస్‌ స్టేషన్‌లో వరుసగా అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడం పోలీసు శాఖలో కలకలం రేపుతోంది.

More క్రైమ్ news

All news · About J Voice