బిజినెస్
రోడ్డు ప్రమాదం 14 మంది ఆర్మీ జవాన్లు గాయాలు డ్రైవింగ్ శిక్షణలో ఉండగా ప్రమాదం
రంగారెడ్డి
*రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అల్లవాడ గేటు సమీపంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న మరో కారును తప్పించే ప్రయత్నంలో ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైంది, ఈ ఘటనలో మొత్తం 14 మంది జవాన్లు గాయపడ్డారు....
ఈ..ప్రమాదంలో డ్రైవింగ్ శిక్షణలో ఉన్న హవల్దార్ అవిందర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరో 13 మంది జవాన్లు కూడా గాయపడ్డారు. గాయపడిన వారిలో మల్లప్ప, విశ్వనాథ్, రాజీవ్, అర్జుప్ప, జీవన్, జీత్వాస్ పరాస్, అశ్విన్, నుద్దిమ్, సూరజ్ తదితరులు ఉన్నారు.
*ఆసుపత్రికి తరలింపు.. నిలకడగా ఆరోగ్యం..* ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఆర్కానో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జవాన్లందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.