ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న భారత ఉపరాష్ట్రపతి
భారత ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సోమవారం సాయంత్రం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.ముందుగా క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉప రాష్ట్రపతి శ్రీ వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయం వద్దకు ఉపరాష్ట్రపతి చేరుకోగానే టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణలు ఆయనను సాదరంగా ఆహ్వానించగా, అర్చక బృందం ఆలయ మర్యాదలతో ఇస్తికఫాల్ స్వాగతం పలికారు. తరువాత ఆయన ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులలో జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్, టిటిడి బోర్డు సభ్యులు రామ్మూర్తి, దివాకర్ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.