ఆంధ్రప్రదేశ్
ప్రముఖ శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం...
తిరుపతి
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఆలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆలయంలోని అన్నప్రసాద పోటులో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలింది. ఒక సిలిండర్ పేలడంతో పక్కనే ఉన్న ఇతర సిలిండర్లకు సైతం మంటలు వ్యాపించాయి. దీంతో అన్నప్రసాద పోటులో అగ్నికీలలు భారీగా ఎగసిపడుతున్నాయి. పేలుడు శబ్దంతో భయాందోళనకు గురైన భక్తులు బయటకు పరుగులు తీశారు. ప్రసాదాలు తయారు చేస్తున్న భక్తులు సైతం బయటకు పరుగులు తీశారు. ప్రమాదం జరిగిన వెంటనే ఆలయ సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.