ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌ను 'క్లీన్ అండ్ ట్రాఫిక్ ఫ్రీ సిటీ'గా తీర్చిదిద్ధలి -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
హైదరాబాద్ నగరంలో ఎక్కడ చెత్త కనిపించకూడదని, నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. క్యూర్ పరిధిలోని మూడు కమిషనరేట్లలో గ్రీన్ ట్యాంకర్ల సరఫరా పెంచాలన్నారు. జూబ్లీహిల్స్ నివాసంలో మున్సిపల్ అధికారులతో వివిధ అంశాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ట్రాఫిక్ జామ్ లు లేకుండా సిగ్నల్ రహిత జంక్షన్లకు ప్రణాళిక చేయాలని అధికారులను ఆదేశించారు.భాగ్య నగరాన్ని పరిశుభ్రమైన, ట్రాఫిక్ జామ్ లు లేని సిటీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో ఎక్కడా చెత్త కనిపించకూడదని, చెత్త సేకరణపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని అధికారులకు సూచించారు. రోజూ ఇంటింటి చెత్త సేకరణ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ ఆదేశించారు.