ఆంధ్రప్రదేశ్

అర్నబ్ తుఫాన్ ప్రభావం తెలంగాణ వ్యాప్తంగా విస్తరిస్తోంది.

తూఫాన్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మంతో పాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మిగతా జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అర్నబ్ తుపాను నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని విద్యాసంస్థలకు కలెక్టర్ అంకిత్ సెలవు ప్రకటించారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లే 12 విమానాలను అధికారులు రద్దు చేశారు. శంషాబాద్ నుంచి విజయవాడ, రాజమండ్రి, విశాఖకు వెళ్లాల్సిన విమానాలు రద్దు చేసినట్లు తెలిపారు. వాతావరణ పరిస్థితుల మేరకు తదుపరి సర్వీసులు నడుపుతామని అధికారులు వెల్లడించారు.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice