ఆరోగ్యం
బిస్లరీ నీళ్ల బాటిల్‌తో క్యాన్సర్ ముప్పు..
మనం ఆరోగ్యం
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ బిస్లరీ నీటి నమూనాల్లో క్యాన్సర్ కారక రసాయనాలు బయటపడ్డాయి! ల్యాబ్ పరీక్షల్లో నీరు సురక్షితం కాదని తేలడంతో బిస్లరీపై ప్రాసిక్యూషన్ చర్యలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి ఇచ్చింది. •బయటకు వెళ్లినప్పుడు దాహం వేస్తే సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఎవరైనా ముందుగా వెతికేది బ్రాండెడ్ వాటర్ బాటిల్ కోసమే. అందులోనూ 'బిస్లరీ' అంటే ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్‌కు పర్యాయపదంగా మారిపోయింది. అలాంటి దిగ్గజ సంస్థ విక్రయించే తాగునీటి నాణ్యతపై ఇప్పుడు పెను దుమారం రేగింది! బిస్లరీ ఇంటర్నేషనల్ సంస్థ తయారు చేసిన ప్యాకేజ్డ్ తాగునీటి నమూనాల్లో ప్రమాదకర రసాయనాలు ఉన్నట్లు ప్రయోగశాల పరీక్షల్లో తేలింది. దీనితో భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) బిస్లరీపై క్రిమినల్ ప్రాసిక్యూషన్ చర్యలు ప్రారంభించింది. •లీటరు నీళ్ల బాటిల్ రూ. 20 పెట్టి కొనేది స్వచ్ఛత, ఆరోగ్య భద్రత కోసమే. అలాంటిది దేశంలోనే అత్యధికంగా అమ్ముడయ్యే బిస్లరీ నీటిలో హానికర రసాయనాలు ఉన్నాయని వెల్లడి కావడం ఇప్పుడు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
Cancer risk from Bisleri water bottles..
Cancer-causing chemicals have been found in samples of Bisleri, a leading packaged drinking water company! FSSAI has given permission for prosecution against Bisleri after lab tests showed that the water was unsafe. •When thirsty when going out, the first thing anyone, from common people to celebrities, looks for is a branded water bottle. Even among them, 'Bisleri' has become synonymous with packaged drinking water. Now there is a big uproar over the quality of drinking water sold by such a giant company! Laboratory tests have revealed that hazardous chemicals are present in samples of packaged drinking water manufactured by Bisleri International. With this, the Food Safety and Standards Authority of India (FSSAI) has initiated criminal prosecution against Bisleri. •A liter bottle of water is bought for Rs. 20 for purity and health safety. The revelation that Bisleri water, one of the country's best-selling brands, contains harmful chemicals is now causing great concern among the public.