ఆంధ్రప్రదేశ్

వేదాలు భారతీయ సంస్కృతికి ప్రాణం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

యాదగిరిగుట్టలో 26వ తెలంగాణ వేద విద్వన్ మహాసభల్లో గవర్నర్ సందేశం

వేదాలు భారతీయ సంస్కృతికి ప్రాణం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో నిర్వహించిన 26వ తెలంగాణ వేద విద్వన్మహాసభల్లో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. తరతరాలుగా వేదాలను పరిరక్షిస్తూ వస్తున్న గురు-శిష్య పరంపర భారతీయ సంస్కృతిలో అత్యంత విశిష్టమైనదని కొనియాడారు. ఆచార్యులు తమ నిరంతర సాధన, అంకితభావంతో వేదాల శుద్ధ ఉచ్చారణ, స్వర, పాఠ సంప్రదాయాలను పరిరక్షిస్తూ వస్తున్నారని పేర్కొన్నారు.ఈ మహాసభల్లో భాగంగా నిర్వహిస్తున్న వేద పరీక్షల్లో పాల్గొంటున్న 500 మందికి పైగా విద్యార్థులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. వారి కృషి, క్రమశిక్షణ భారతీయ సాంస్కృతిక వారసత్వం ఉజ్వల భవిష్యత్తుకు నిదర్శనమని అన్నారు. జయపత్రాలు అందుకున్న 10 మంది వేద విద్వాంసులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ..కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డి శ్రీధర్ బాబు, ప్రభుత్వ చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, గవర్నర్ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎం దాన కిషోర్, ధార్మికసలహాదారు ఆర్ గోవింద్ హరి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జె భవానీశంకర్, పూజ్య ఆచార్యులు, వేద పండితులు, భక్తులు పాల్గొన్నారు.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice