ఆంధ్రప్రదేశ్

రానున్న ఎన్నికల్లో అన్ని జిల్లా పరిషత్, ఎంపీపీ స్థానాలు దక్కించుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు సూచన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తలతో ఏపి సీఎం చంద్రబాబు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై వారికి ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రజలకు మనం అండగా నిలిస్తే.. వారు మనతోనే ఉంటారని స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ద్వారా నిరూపితమైందని తెలిపారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 94 శాతం స్ట్రెయిక్ రేట్ సాధించామని అన్నారు.

*వారికి నామినేటెడ్ పోస్టులు..* మున్సిపాలిటీలు, కార్పొరేషన్లల్లో దక్కిన విజయం.. మన బాధ్యతను పెంచిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ఫలితాలు కూటమి సంక్షేమం - అభివృద్ధి - సుపరిపాలనకు గుర్తింపు అని అభివర్ణించారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని వారికి నామినేటెడ్ పోస్టులతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో అనుకున్న విధంగానే ఫలితాలు వచ్చాయని పేర్కొన్నారు. పట్టణ స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. గుడ్ గవర్నెన్స్.. గుడ్ పాలిటిక్స్ ఇదే కూటమి ప్రభుత్వ విధానం అని తెలిపారు.

More ఆంధ్రప్రదేశ్ news

All news · About J Voice